![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -53 లో...... నందుని పెళ్లికూతురులాగా రెడీ చేస్తారు. అందరు పెళ్లి మండపంకి వస్తారు. వాళ్ళకి సింహాద్రి వాళ్ళు స్వాగతం చెప్తారు. నా మేనకోడలు పెళ్లి ఎలాంటి లోటు లేకుండా జరగాలని సింహాద్రి అనగానే మావయ్య ఎంత మంచివాడో అని నందు అంటుంది. మీ మేలు ఎప్పటికి మర్చిపోను అన్నయ్య అని శారద అంటుంది. ఆ తర్వాత జాను మాత్రం ఇంకా డౌట్ గానే ఉంటుంది. పెళ్లిచూపుల్లో సింహాద్రి చేస్తున్న హడావిడిని జానూ గమనిస్తుంది. అమెరికా సంబంధం క్యాన్సిల్ అయినప్పుడు అసలు సింహాద్రి అంకుల్ చేతిలో సంబంధం లేదు.. అంత సడెన్ గా ఎలా వచ్చిందని సూర్యతో జానూ అంటుంది.
నువ్వు ఎవరికో కాల్ చేసావ్ కదా వాళ్ళని కనుక్కోమని సూర్య అనగానే అతని ఫోన్ కలవడం లేదని జానూ అంటుంది. మరొకవైపు గౌతమి దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. తనకి ముద్దు పెట్టబోతుంటే ఇప్పుడు వద్దని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గౌతమి. అప్పుడే కళ్యాణ్ ఫ్రెండ్స్ వస్తారు. నీ చూపు అమ్మాయి పడ్డది అంటే ఆ అమ్మాయి నీకు దక్కాల్సిందే కానీ గౌతమి అలా కాదని తన ఫ్రెండ్స్ అంటారు. మా నాన్నకి వాళ్ళ తోటపై కన్ను పడింది.. నాకు తనపై కన్ను పడిందని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకుకి ఒక కొడుకు ఉంటాడు.. ఆ బాబుని ఎందుకు తీసుకొని వచ్చావని పెళ్లికొడుకుపై సింహాద్రి కోప్పడుతాడు. ఈ విషయం గనుక జానూకి తెలిస్తే ఇష్యూ చేస్తుందని సింహాద్రి అనగానే ఏం ఇష్యూ చేస్తాను అంకుల్ అని జానూ అప్పుడే అనుకుంటూ వస్తుంది. సూర్య కూడా వస్తాడు. జానూ అంతా విందేమో అని సింహాద్రి టెన్షన్ పడుతారు కానీ ఏం వినదు.. మీ తరుపున బంధువులు ఎవరు రాలేదు ఎందుకని అబ్బాయి వాళ్ళని జానూ అడుగుతుంది. వస్తే చాల మంది ఉన్నారు అందుకే పిల్వలేదని అబ్బాయి వాళ్ళు అంటారు. ఒకసారి మీ వీసా చూపించండి అని జానూ అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకని సింహాద్రి కవర్ చేస్తాడు.
ఆ తర్వాత పెళ్లి కొడుకు దగ్గరికి బాబు వచ్చి నాన్న అంటాడు. దాంతో జాను షాక్ అవుతుంది. అంటే బాబు మా కజిన్ కొడుకు మా ఇంట్లోనే ఉంటాడు అందుకే అలా అని అతను కవర్ చేస్తారు. అప్పుడే శారద వస్తుంది. ఈ బాబు నాన్న అని పిలుస్తున్నాడని జాను చెప్పగానే శారద షాక్ అవుతుంది. ఎందుకు జాను వాళ్ళని అవమానిస్తున్నావని సింహాద్రి కోప్పడతాడు. దాంతో జానూ చేత వాళ్ళకి సారీ చెప్పిస్తుంది శారద. తరువాయి భాగంలో సింహాద్రి తీసుకొని వచ్చిన సంబంధం పెద్ద ఫ్రాడ్ అని జానూకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |